ఇంత భారీ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం ఏ పార్టీకి లాభిస్తుందో, ఏ పార్టీని ముంచేస్తోందోననే ఆందోళన నేతలు, అభ్యర్ధుల్లో కనిపిస్తోంది. సాయంత్రం ఏడు గంటల వరకు బూత్ లోపల క్యూలైన్లలో నిలబడ్డ ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించింది ఎన్నికల సంఘం.
టీఆర్ఎస్ వ్యతిరేక ట్రెండ్ వల్లే ఓటింగ్ పెరిగిందని బీజేపీ నేతలు చెబుతుండగా, ఈటలను ఓడించడానికే జనం పెద్ద ఎత్తున ఓట్లేస్తున్నారని గులాబీ నేతలు అంటున్నారు. దీంతో ఎవరికి వారే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఎవరిది విజయమనేది ఈనెల 2న తేలిపోనుంది.