తెలంగాణాలో నేటితో ముగియనున్న 'భారత్ జోడో యాత్ర'

సోమవారం, 7 నవంబరు 2022 (13:27 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడా యాత్ర సాఫీగా సాగిపోతోంది. ఇందులోభాగంగా, ప్రస్తుతం తెలంగాణాలో ఈ యాత్ర కొనసాగుతోంది. ఇది సోమవారంతో తెంలగాణాలో ముగియనుంది. గత నెల 23వ తేదీన కర్నాటక రాష్ట్రం నుంచి తెలంగాణాలోకి అడుగుపెట్టిన విషయం తెల్సిందే. ఈ యాత్ర నవంబరు 7వ తేదీతో తెలంగాణాలో ముగియనుంది. 
 
ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరు వద్ద రాహుల్ గాంధీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు తరలివస్తున్నారు. సభ అనంతరం మహారాష్ట్రలోని దెగ్లూర్‌లో రాహుల్ పాదయాత్ర ప్రవేశిస్తుంది. 
 
తెలంగాణాలో మేనూరు ద్దే పాదయాత్ర ముగుస్తుంది. దీంతో టీపీసీసీ కమిటీ బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహించనుంది. సుమారు లక్ష మందికిపైగా జనాలతో రాహుల్ గాంధీ బహిరంగ సభ ఏర్పాటు చేసి రాహుల్ గాంధీకి వీడ్కోలు పలకాలని టీపీసీసీ భావిస్తుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు