కొత్త విద్యా సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు ఉదయం వేళల్లో అల్పాహారం అందజేయనున్నట్టు మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఈ విషయాన్ని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఇదే విషయంపై ఆమె భూపాలపల్లిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ. ఈ విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉదయం పూట అల్పాహారం అందిస్తామన్నారు.
ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. కొత్త సచివాలయంలో తన తొలి సంతకం అంగన్వాడీ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా ఫైలుపై చేసినట్టు ఆమె గుర్తు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితం బీజేపీకి చెంపపెట్టు అని వ్యాఖ్యానించారు. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. ప్రతి సర్కార్ బడిలోనూ ఉదయం పిల్లలకు అల్పాహారం అందించేంకావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖాయమన్నారు.