అన్నాచెల్లెలు ప్రేమించుకున్నారు, పెద్దలు పెళ్లికి వద్దనారని...

సోమవారం, 4 నవంబరు 2019 (12:16 IST)
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మహరాజ్ పేట గ్రామంలో  విషాద ఛాయలు అలముకున్నాయి. మహరాజ్ పెట్ గ్రామానికి చెందిన మమత  వయస్సు 20 సంవత్సరాలు. వరసకు బంధువైన రమేష్‌తో కొంతకాలంగా ప్రేమలో పడింది. అతడు కూడా ఆమెను ఇష్టపడ్డాడు.
 
వారిద్దరి కుటుంబసభ్యులకు తెలుపగా అన్నాచెలెళ్లు అవుతారని అభ్యంతరం తెలి పారు. అయితే  మమతకు వేరే అబ్బాయితో నిశ్చితార్థం చేశారు.  దీనితో ఇద్దరు మనస్థాపానికి గురై ఇంట్లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.
 
వెంటనే హైదరాబాద్‌లో ప్రముఖ హాస్పిటల్‌కి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మమత మృతి చెందింది. రమేష్ పరిస్థితి మాత్రం విషమంగా ఉంది. శంకర్ పల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు