గుల్బర్గా వెళుతున్న కారులో మంటలు - ప్రయాణికులు సురక్షితం

ఆదివారం, 12 సెప్టెంబరు 2021 (15:51 IST)
హైదరాబాద్ నుంచి గుల్బర్గా వెళుతున్న కారులో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్‌ జిల్లాలో జరిగింది. 
 
జిల్లాలోని కొడంగల్ మండలం కస్తూర్‎పల్లి వద్ద హైదరాబాద్ నుంచి గుల్బార్గా వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే కారును ఆపివేశాడు. 
 
అందులో ఉన్నవారంతా కిందికి దిగడంతో అంతా క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు....!

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు