శ్రీశైలం పవర్ ప్లాంట్ అగ్నిప్రమాదస్థలంలో సీఐడీ విచారణ బృందం

శనివారం, 22 ఆగస్టు 2020 (13:29 IST)
శ్రీశైలం భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సీఐడీ విచారణకు ఆదేశించారు. దీంతో సీఐడీ విచారణ బృందం శనివారం జల విద్యుత్ కేంద్రానికి చేరుకుంది. విచారణ కమిటీ సభ్యులు జల విద్యుత్ కేంద్రంలోకి వెళ్లారు. 
 
వీరితో పాటు విద్యుత్, ఫోరెన్సిక్, సీఐడీ, లోకల్ పోలీస్ టీంలు పవర్ హోస్‌లోకి వెళ్లాయి. సి.ఐ.డి డిఎస్పీ, సిఐలు, ఎస్.ఐలు జల విద్యుత్ కేంద్రానికి చేరుకున్నారు. అలాగే, సీఐడీ ఛీఫ్ గోవింద్ సింగ్ పవర్ హోస్‌లోకి వెళ్ళారు. జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించిన విషయాలను అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. 
 
జల విద్యుత్ కేంద్రానికి సంబంధించిన వివిధ శాఖలకు సంబంధించిన డీఈలు, ఏఈలు కేంద్రం వద్దకు చేరుకున్నారు. చీఫ్ ఇంజనీర్, డైరెక్టర్లు జల విద్యుత్ కేంద్రానికి చేరుకున్నారు. ఈ బృందం ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపి, జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఓ నివేదిక ఇవ్వనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు