తెలంగాణ రాష్ట్ర రైతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ తేరుకోలేని షాకిచ్చారు. రైతులు వరిపంటను సాగు చేయడం శ్రేయస్కరం కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం కిలో బాయిల్డ్ రైస్ కూడా కొనదని అందువల్ల రైతులు వరిపంటను సాగు చేయొద్దని కోరారు. అలాగే, రాష్ట్ర వ్యాప్తంగా అనేక రైస్ మిల్లులు మూతపడుతున్నాయని గుర్తుచేశారు. అందువల్ల రైతులు వరిపంటను సాగు చేయొద్దని కోరారు.
అదేసమయంలో కేంద్ర ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి, ఆహార ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు చేయాలని కోరారు. కేంద్రానికి దూరదృష్టి లేకపోవడం వల్ల ఆహార ధాన్యాల నిల్వలు కుప్పలుతెప్పలుగా పేరుకుని పోతున్నాయని అన్నారు.