తెలంగాణ రాష్ట్రంలోని టీఎస్ఈసెట్ తుది విడత కౌన్సెలింగ్ సోమవారం నుంచి ప్రారంభంకానుంది. ఈసెట్ ద్వారా పాలిటెక్నిక్ పూర్తిచేసిన విద్యార్థులు బీటెక్ ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇందుకోసం ఈ నెల 14వ తేదీ మంగళవారం నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందని సాంకేతిక విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
14, 15 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని, 17న సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. విద్యార్థులు ఈ నెల 17 -20 వరకు ట్యూషన్ ఫీజును చెల్లించాలని సూచించారు. ఎంసెట్‌లో ఈడబ్ల్యూఎస్ కోటా కింద 6,894 సీట్లు లభ్యంకానున్నాయి. ఈ సీట్లను పూర్తిగా కన్వీనర్ కోటాలో భర్తీచేయనున్నారు. ఇంజినీరింగ్‌లో 6,521, బీ ఫార్మసీలో 321, ఫార్మా -డీలో 52 సీట్లు ఉంటాయని అధికారులు వెల్లడించారు.