అప్పుడేమో నిజాం నవాబులు.. ఇప్పుడు టీఆర్ఎస్ నేతలు.. విజయమ్మ

మంగళవారం, 3 నవంబరు 2020 (13:12 IST)
దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్ ఉదయమే ప్రారంభం అయింది. ఇప్పటికే బొప్పాపూర్‌ పోలింగ్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు, చిట్టాపూర్ గ్రామంలో టిఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత, తుక్కాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీపై  కాంగ్రెస్‌ నాయకురాలు విజయశాంతి విరుచుకుపడ్డారు. 
 
దుబ్బాక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. "నిజాం నవాబులు తమ విధేయులైన దొరల దన్ను, ఆర్థిక, భూ బలాలు, కిరాయి బలగాలతో ఏ విధమైన అధికారం చెలాయించారో అదే ధోరణిలో నేటి నయా టీఆర్ఎస్ దొరలు ప్రజాస్వామ్యాన్ని తమ అహంకారపు అదుపాజ్ఞలలోని యంత్రాంగంగా వ్యవస్థీకృత చెల్లుబాటు చేసి... తెలంగాణ బిడ్డలపై నడిపించే ప్రక్రియ జరుగుతున్నదనేది వాస్తవమని చెప్పుకొచ్చారు. విజ్ఞులైన మన తెలంగాణ ప్రజలు ఇది గమనించి దుబ్బాక ఎన్నికలలో టీఆరెస్‌కు సరైన బుద్ధి చెబుతారని విశ్వసిస్తున్నానని విజయశాంతి మండిపడ్డారు. 
 
. టీఆర్ఎస్ శాసనసభా పక్షంలో సీఎల్పీ విలీనాన్ని నిరసిస్తూ భట్టి చేస్తున్న ఆమరణ దీక్ష పై యావత్ తెలంగాణ చర్చించుకుంటుందని చెప్పారు. సీఎల్పీ విలీనంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం ప్రకారం వచ్చిన ప్రతిపక్ష హోదాను లాక్కున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం భట్టి విక్రమార్క చేస్తున్న ఆమరణ దీక్ష కొత్త చర్చకు దారితీసిందన్నారు. ఎప్పటికి తామే అధికారంలో ఉండాలనే దురుద్దేశంతో టీఆర్ఎస్ వరుస తప్పులు చేస్తోందని విజయశాంతి విమర్శించారు. 
 
ఇటీవల ఏపీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు గుర్తుకొస్తున్నాయని.. వైసీపీ ఎమ్మెల్యేలను అన్యాయంగా టీడీపీలో చేర్చుకుని చంద్రబాబు సంబుర పడ్డారని.. అనంతరం తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వారు ఘోర పరాజయం పాలయ్యారని తెలిపారు. తెలంగాణలోనూ అటువంటి పరిస్థితి వస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు