తెలంగాణాలో వెయ్యికి చేరువైన కరోనా కేసులు.. కొత్తగా 56

మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (20:29 IST)
కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తోంది. కఠిన చర్యలు తీసుకుంటోంది. లాక్‌డౌన్ కూడా పొడగించింది. లాక్‌డౌన్ ఆంక్షలను కూడా కఠినతరం చేసింది. రెడ్ జోన్ ఏరియాలను సీల్ చేసింది. అయినప్పటికీ.. తెలంగాణాలో కరోనా కేసులు ప్రతి రోజూ పదుల సంఖ్యలో నమోదవుతున్నాయి. మంగళవారం కూడా మరో 56 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులకు దిక్కుతోచడం లేదు. 
 
తాజాగా నమోదైన కొత్త కేసులతో కలుపుకుని మొత్తం కరోనా కేసుల సంఖ్య 928కు చేరింది. అలాగే, కరోనా వైరస్ బారినపడి ఇప్పటివరకు 23 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 711 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకొని 8 మంది డిశ్చార్జ్‌ కాగా ఇప్పటి వరకు మొత్తం 194 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. 
 
కాగా, సూర్యాపేట జిల్లాలో ఒక్కరోజే 26 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. జీహెచ్‌ఎంసీలో 19, నిజామాబాద్‌లో 3, గద్వాలలో 2, ఆదిలాబాద్‌లో 2 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, ఖమ్మం, మేడ్చల్‌, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్కోటి చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు