జూన్ 2... అంటే ఈ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. 2014లో పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఉనికిలోకి వచ్చింది. ఫిబ్రవరి 8, 2014న కాంగ్రెస్, బిజెపి మద్దతుతో తెలంగాణ బిల్లును లోక్ సభ ఆమోదించింది.
బిజెపి, ఇతర ప్రతిపక్ష పార్టీల మద్దతుతో తెలంగాణ బిల్లును రాజ్యసభ ఆమోదించింది. ఈ బిల్లు రాష్ట్రపతి అంగీకారం పొంది 2014 మార్చి 1న గెజిట్‌లో ప్రచురించబడింది. మార్చి 4, 2014న భారత ప్రభుత్వం జూన్ 2, 2014ను తెలంగాణ నిర్మాణ దినంగా ప్రకటించింది.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ప్రతి ఏడాది ఎంతో ఘనంగా జరుపుకునేవారు. కానీ ఈ సంవత్సరం కరోనా వైరస్ COVID-19 మహమ్మారి కారణంగా వేడుకలు మునుపటి సంవత్సరాల మాదిరిగా జరుగటంలేదు. తెలంగాణ నిర్మాణ దినోత్సవం రోజున, రాష్ట్ర ప్రజలు స్నేహితులు, పొరుగువారు, వారి కుటుంబాలతో సమయాన్ని గడపడం ద్వారా ఈ రోజును జరుపుకుంటున్నారు.