కరోనా వైరస్‌పై న్యూజిలాండ్ జయభేరి.. సున్నా కేసులు

సోమవారం, 8 జూన్ 2020 (17:15 IST)
Corona Virus zero
కరోనా వైరస్‌పై న్యూజిలాండ్ జయభేరి మోగించింది. కరోనాపై యావత్ ప్రపంచం పోరాడుతుంటే పక్కా ప్రణాళికలతో కరోనా వైరస్‌ను తమ దేశం నుంచి తరిమికొట్టింది న్యూజిలాండ్. సున్నా కేసులతో ఘనవిజయం సాధించింది. లాక్ డౌన్ నిబంధలను ప్రజలంతా క్రమశిక్షణగా పాటించారు. కరోనాతో చేస్తున్న యుద్ధంలో భాగంగా లాక్ డౌన్ విధించిన న్యూజిలాండ్ ప్రజల్ని నిత్యం చైతన్యపరుస్తూ వచ్చింది. న్యూజిలాంట్ ప్రధాని జెసిండా అర్డెర్న్ ప్రజల్ని చైతన్య పరచటంతో కీలక పాత్ర వహించారు.
 
మాస్క్ లకు కట్టుకుంటూ.. భౌతిక దూరం పాటిస్తే ఎటువంటి మేలు జరుగుతుందో కరోనాను ఎంత త్వరగా తరమివేయగలమో అనే విషయంపై మీడియా ద్వారా ప్రజల్ని చైతన్య పరిచారు. ప్రజలు కూడా చక్కగా సహకరించటంతో ఈ విజయం సాధ్యమైంది. కానీ న్యూజిలాండ్ లాగా ఏ దేశానికి సాధ్యం కావటంలేదు. కరోనాను అరికట్టడానికి లాక్‌డౌన్ విధించి భౌతిక దూరం పాటిస్తూ జనం అప్రమత్తంగా ఉంటున్నారు. 
Newzealand PM
 
ఇప్పటికీ అదే చేస్తున్నారు. దీంతో కరోనాను పూర్తి స్థాయిలో న్యూజిలాండ్ కట్టడి చేసింది. గత కొన్ని రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. చివరి రోగి కూడా తాజాగా కోలుకొని డిశ్చార్జి కావడంతో వైరస్ బాధితుల సంఖ్య సున్నాకు చేరింది. దీంతో అక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బీచ్‌ల్లో కొచ్చి చక్కగా హాయిగా చిన్నారులతో సహా ఎంజాయ్ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు