గాలి ద్వారా కరోనా వ్యాప్తి .. తెలంగాణాలో బెడ్లు కూడా దొరకవు...

గురువారం, 15 ఏప్రియల్ 2021 (08:54 IST)
తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తిస్తోంది. ముఖ్యంగా గత నాలుగు వారాలుగా ఇదే పరిస్థితి కనిపిస్తున్నాయని, ఇపుడు మరింత అప్రమత్తంగా లేకపోతే ఆస్పత్రుల్లో బెడ్లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్  శ్రీనివాసరావు హెచ్చరించారు. 
 
మరో ఆరు వారాలు ఇదే పరిస్థితి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు సహకరించక పోతే తెలంగాణ కూడా మహారాష్ట్రగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముందు ముందు ఆస్పత్రిలో బెడ్స్ దొరక్కుండా పోయే ప్రమాదం ఉందని చెప్పారు. 
 
ఆర్థిక ఇబ్బందులు రావద్దని లాక్డౌన్, కర్ఫ్యూ వంటివి పెట్టడం లేదన్నారు. పరిస్థితి తెలంగాణలోనూ తీవ్రంగా ఉందని చెప్పారు. ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు. ఇప్పుడు ఉన్న వైరస్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతుందని శ్రీనివాసరావు తెలిపారు. 
 
అదేసమయంలో కరోనా మహమ్మారి గాలి ద్వారా కూడా వ్యాపిస్తోందని.. అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇప్పటికే కొన్ని ఆస్పత్రుల్లో కరోనా రోగులకు పడకల కొరత ఏర్పడిందన్నారు. గతంతో పోల్చితే ప్రస్తుత వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని చెప్పారు. ఇంట్లో ఒకరికి వైరస్‌ సోకితే గంటల్లోనే మిగతా వారికి వ్యాపిస్తుందన్నారు. 
 
ఇప్పటివరకు బయట మాత్రమే మాస్క్‌ వేసుకోమని చెప్పామని.. ఇకపై ఇంట్లో ఉన్నా మాస్క్‌ ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని.. మరో 4 నుంచి 6 వారాల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు