అసోంలో ఓ భారీ కాలనాగు (కింగ్ కోబ్రా) కలకలం సృష్టించింది. నగావ్ ఏరియాలోని ఓ తేయాకు తోటలో 16 అడుగుల పొడవున్న భారీ నల్లత్రాచును చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ సొసైటీ వారికి సమాచారం ఇవ్వగా వారు ఘటనా ప్రాంతానికి చేరుకుని ఆ కింగ్ కోబ్రాను గోనె సంచిలో బంధించారు.