సాప్ట్వేర్ ఉద్యోగం ఇదివరకు ఓ బంగారు కలల సౌధంలా కనిపించేది. ఇప్పుడు అదే ఉద్యోగంలో చేసేవారు చాలామంది బిక్కుబిక్కుమంటున్నారు. ఐటీ రంగంలో పోటీ ఎక్కువ కావడం ఒకవైపు, నానాటికీ ఈ కోర్సులను చేసేవారు ఎక్కువ సంఖ్యలో వుండటంతో పరిస్థితి దిగజారుతోంది. మాదాపూర్ ఐటీ కారిడార్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వాకానికి 200 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. వీరితో సదరు కంపెనీ బలవంతంగా సంతకాలు చేయించి రాజీనామా చేయించినట్లు ఆరోపణలు చేస్తున్నారు.