ఆమె అంతకుముందు బాలవాణీ అనే రేడియోలో పనిచేసింది. రెండు నెలల నుంచి ఆమెను గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. అన్ని ఆధారాలు ఉండడంతోనే అరెస్టు చేశాం. చాలా తీవ్రమైన కేసుగా పరిగణించవచ్చు. బాధితురాలి ఆర్థిక పరిస్థితులను ఆసరాగా తీసుకుని లైంగిక వేధింపులకు గురిచేశాడు అని పోలీసులు వ్యాఖ్యానించారు.
బాధితురాలి ఫిర్యాదు తర్వాత ఆలయవాణి వెబ్ రేడియో ఆఫీసులో కూడా కొంతమంది ఉద్యోగులను విచారించామని తెలిపారు. అనంతరం పక్కా ఆధారాలతో గజల్ శ్రీనివాస్‌ను మంగళవారం అరెస్టు చేశామని ఏసీపీ విజయ్ కుమార్ పేర్కొన్నారు. గజల్ శ్రీనివాస్‌పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశామని తెలిపారు. గజల్‌పై 354, 354ఏ, 509 సెక్షన్ ఐపీసీ కింద కేసులు నమోదు చేశామని ఏసీపీ విజయ్‌కుమార్ స్పష్టంచేశారు.