గూగుల్‌లో సెర్చ్ కొంపముంచింది.. రూ.19వేలు గోవిందా!

శుక్రవారం, 10 డిశెంబరు 2021 (20:43 IST)
క్రిడెట్ కార్డు కస్టమర్ కేర్ నెంబర్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేసిన యువతి ఏకంగా రూ.19వేలను కోల్పోయింది. ఈ ఘటన బాలానగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. బాలానగర్ డివిజన్ పరిధిలో రాజు కాలనీకి చెందిన ఓ యువతి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు.
 
ఈ నెల 03వ తేదీన క్రెడిట్ కార్డు యొక్క ఈఎంఐ డ్యూడేట్‌ను మార్చుకోవడానికి గూగుల్‌లో సెర్చ్ చేయగా 7718320995 అనే ఫోన్ నెంబర్ కనిపించింది.

ఆ నెంబర్‌కు ఫోన్ చేశారు. కానీ.. కట్ అయ్యింది. కొద్దిసేపటి అనంతరం అదే నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. హిందీలో మాట్లాడాడు. 
 
ఈఎంఐ డ్యూ డేట్ మార్చాలని సూచించారు. ఎనీ డెస్క్ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుని, అందులో వచ్చిన కోడ్‌ను చెప్పాలని కోరగా, అదేవిధంగా చేయగా రూ. 19,740 రూపాయలు కట్ అయ్యాయి. 
 
మరలా ఫోన్ చేయగా అది పని చేయలేదు. తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు