దళిత బంధుపై నిఘా ... బాధ్యతలు థర్డ్ పార్టీకి : సీఎం కేసీఆర్

గురువారం, 26 ఆగస్టు 2021 (09:53 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాల్లో దళిత బంధు ఒకటి. ఈ పథకం అమలుతో పాటు.. లోటుపాట్లపై ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ సీరియస్‌గా దృష్టిసారించారు. ముఖ్యంగా, ఈ పథకం అమలులో ఎలాంటి లోటుపాట్లతో పాటు అవినీతి అక్రమాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు వీలుగా నిఘా వేశారు. ఆ బాధ్యతలను థర్డ్ పార్టీకి అప్పగించాలని నిర్ణయించారు. 
 
దేశంలో అత్యంత భారీ ఆర్థిక సాయంతో తలపెట్టిన సంక్షేమ పథకం కావడంతో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలని ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా పథకం అమలు ఎలా జరుగుతోంది? ఎలాంటి పొరపాట్లు దొర్లుతున్నాయి? ఏ విధానాలు వ్యాపారానికి ప్రతికూలంగా మారుతున్నాయి? తదితర విషయాలపై నిరంతరం ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు విజిలెన్స్‌ తరహాలో ఓ సంస్థ పనిచేయాలని సీఎం నిర్ణయించారు. 
 
ఇటు లబ్ధిదారులకు, అటు ప్రభుత్వాధికారులకు సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలియాలంటే థర్డ్‌పార్టీ (ప్రైవేటుసంస్థ) పర్యవేక్షణ ఉండాలన్న సీఎం ఆలోచనల మేరకు ఇప్పటికే బాధ్యతలు అప్పగించారు. ఇది విజయవంతం కావాలంటే అమలుపై మూడో నేత్రం ఉండాలన్న తలంపుతోనే థర్డ్‌పార్టీకి విజిలెన్స్‌ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు