కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ ఎంపీ, మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితా దేవ్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖను పంపారు. ఆమె రాజీనామాతో పార్టీకి ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.