రోగుల ఆరోగ్య పరిస్థితిని బట్టి ఓపీ ట్రీట్మెంట్ కొందరికి, తీవ్రతనుబట్టి హస్పిటల్‌లో మరికొందరిని చేర్చుకుని ట్రీట్ చేస్తున్నారు. అయితే ప్రైవేట్ ఆస్పత్రిలో మాత్రం డెంగీ లక్షణాలు కనిపిస్తే చాలూ లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం జిల్లాల్లో అధికంగా డెంగ్యూ కేసులు నమోదవతున్నాయి. హైదరాబాద్‌లో 447, ఖమ్మంలో 134 కేసులు, రంగారెడ్డిలో 110 కేసులు మొత్తానికి ఈ ఏడాది ఇప్పటికే 12 వందల కేసులు నమోదయ్యాయి.
రెండేళ్ళ క్రితం ఈ సారి సైతం డెంగీ డేంజరస్‌గా విజృంభిస్తోంది. హైదరాబాద్‌లో ఫీవర్ ఆస్పత్రి, నిలోఫర్, గాంధీ, ఉస్మానియాల్లోని ఓపీలు రోగుల క్యూలైన్లతో నిండిపోతున్నాయి. అధికారులు ఇప్పటికైన మేల్కొని తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆస్పత్రుల్లో సరైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు.