పరారీలో ఫెడరేషన్ నాయకుడు - నిర్మాతల మండలి మీటింగ్ కు గైర్హాజరు ?

దేవీ

గురువారం, 21 ఆగస్టు 2025 (12:34 IST)
24 Crafts Feration leaders
24 Crafts Feration leaders
సినీ కార్మికుల జీతాల పెంపుపై పోరాడుతూ కార్మికులచేత సమ్మె చేయిస్తున్న 24 క్రాఫ్ట్ సంఘాల ఫెడరేషన్ నాయకుడు పరారీలో వున్నట్లు తెలుస్తోంది. మొన్న అన్నపూర్ణ ఏడెకరాల సమీపంలోని ఫెడరేషన్ కార్యాలయంలో కార్మికులచేత మీటింగ్ ఏర్పాటుచేశారు. అప్పటికే సి. కళ్యాణ్, చిరంజీవి నుంచి త్వరలో పరిష్కార దిశగా చూస్తామని హామీ ఇచ్చినా ఫెడరేషన్ నాయకుడు వల్లభనేని అనిల్ మీటింగ్ ఏర్పాటు చేయడంపై సర్వత్రా వ్యతిరేక వ్యక్తమైంది. 
 
ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిన్న జరిగిన ధర్నా ఎలాంటి పర్మిషన్ లేకుండా లా అండ్ ఆర్డర్ ని విస్మరించి రోడ్ లను బ్లాక్ చేస్తూ చిత్రపురి అవినీతి ని పక్కదారి పట్టడం కోసం, చేసిన ధర్నా పైన తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ కమిషనరేట్ సీరియస్ గా వున్నట్లు తెలిసింది. పరారి లో వల్లభనేని అనిల్ కుమార్, సీక్రెట్ గా పెద్దల దగ్గరికి వెళ్లి కాళ్ళ బేరం చేస్తున్నట్లు సమాచారం.
 
ఫెడరేషన్ అధ్యక్షుడు, చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్ కుమార్ పైన సైబరాబాద్ కమిసినరేట్ లో అవినీతితోపాటు సుమారు 22 క్రిమినల్ కేసులున్నాయి, పీడీ యాక్ట్ లేకుండా పక్కదోవ పట్టడం కోసం, చిత్రపురి కొత్తగా నిర్మించే టవర్స్ లు కోర్ట్ స్టే లో ఉన్నా కూడా చండి యాగం పేరు తో భూమి పూజ చేయడం ఇలాంటి ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడిన ఫెడరేషన్ ప్రెసిడెంట్ మరియు చిత్రపురి ప్రెసిడెంట్ పైన వెంటనే పీడీ యాక్ట్ పెట్టి వల్లభనేని అనిల్ కుమార్ ని జైలు లో వేయాలని చిత్రపురి బాధితులు, సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు
 
నిర్మాతలమండలికి హాజరుకావడంలేదా?
పరారీ లో వున్న నాయకుడితో సవారీ ఎలా సాధ్యం.  ఈ రోజు అనగా గురువారంనాడు జరగాల్సిన నిర్మాతలతో మీటింగ్ కి ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ హాజరు కావడం లేదు. చిత్రపురి లో వున్న 22 క్రిమినల్ కేసులు అనేక ఆర్ధిక ,,నేరపూరిత కేసులలో అతని గురించి పోలీసులు ప్రయత్నించగా నిన్నటినుండి ఆతను పరారీలో ఉన్నట్టు సమాచారం ..ఈ కారణంగా చర్చలకు ప్రతిష్టంబన ఏర్పడింది.
 
ఎలాగో ఫెడరేషన్ కాల పరిమితి ఏప్రిల్ తో అయిపోయింది కాబట్టి మీరు ముందు మీ 24 క్రాఫ్ట్ లలోనుంచి మరొక నాయకుడిని ఎన్నుకుని రండి అప్పుడే చర్చలు జరుగుతాయి. నేరచరిత్ర కలిగినవాడిని మీరు నాయకుడిగా ఎలా గుర్తిస్తారు. ఇది ఎంతమాత్రం సమర్ధనీయం కాదు అని నిర్మాతలు పట్టుదలగా వున్నారు. ఈ నేపధ్యం లో అమాయకులైన కార్మికులు బలైపోతున్నారు. కార్మికుల క్షేమం గురించి మరో నాయకుడిని ఎన్నుకుని వెంటనే చర్చలకు రమ్మని చిన్న నిర్మాతలు ..పెద్ద నిర్మాతలు ..యాక్టివ్ నిర్మాతలు అందరూ ఇదే అడుగుతున్నారు ..మొత్తానికి కార్మికులను అనాధలను చేసిన అనిల్ కుమార్ ..పరార్ ..కార్మికసోదరులారా పారా హుషార్ అంటూ చిత్రపురి ఉద్యమకారులు ఓ ప్రకటనలో తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు