రైతులు పండించే వానాకాలం పంట ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కోసం రాష్ట్రవ్యాప్తంగా 6,663 కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటివకే 5.15 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని వెల్లడించారు.
ఆ పార్టీ నేతలు అబద్ధాలు చెప్పి బతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నేతల మాటలను తెలంగాణ రైతులు నమ్మొద్దన్నారు. వడ్లు తాము కొంటున్నామని, బియ్యం కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదని స్పష్టం చేశారు. యాసంగి పంట మొత్తం కేంద్రమే కొనాలని డిమాండ్ చేశారు.