ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులో కత్తెర మర్చిపోయి కుట్లు వేసేశారు..

గురువారం, 15 అక్టోబరు 2020 (11:59 IST)
ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. చికిత్స కోసం వచ్చిన వ్యక్తి కడుపులో కత్తెర మరిచిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తికి ఆపరేషన్ చేసిన కొన్ని రోజులకి అనంతరం కడుపులో కత్తెర మర్చిపోయి కుట్లు వేసేశారు వరంగల్ ఎంజీఎం వైద్యులు. బెల్లంపల్లిలోని శాంతిగనికి చెందిన రాజు వరంగల్ ఎంజీఎంలో ఆపరేషన్ చేయించుకున్నారు. 
 
అయితే తాజాగా మరోసారి కడుపునొప్పి రావడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఎంజీఎంకి వచ్చాడు. ఎక్స్‌రే తీసిన వైద్యులకి కడుపులో కత్తెర ఉన్నట్లు కనిపించిది. దీంతో- బాధితుడికి, అతని కుటుంబ సబ్యులకు తెలియకుండా, బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచి మరోసారి ఆపరేషన్ చేసేందుకు వైద్యులు ప్రయత్నం చేశారు. ఇప్పటికీ ఆ వృద్ధుడికి అసలు విషయం తెలియ పర్చకుండా ఎలా చెప్పాలి అనే దాని మీద ఎంజీఎం సిబ్బంది మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు