కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తుల పట్ల ఎవరైనా వివక్ష చూపవద్దని, హేళనగా మాట్లాడవద్దని, ఇంటి యజమానులు, చుట్టు పక్కల వ్యక్తులు ఇబ్బందులకు గురి చేయవద్దని నల్లగొండ జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ సూచించారు.
సరైన జాగ్రత్తలు, ఆరోగ్య రక్షణ చర్యలు చేపట్టడం ద్వారా, రోగ నిరోధక శక్తిని శరీరంలో పెంచుకునే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పాజిటివ్ వచ్చిన చాలా మంది కోలుకున్నారని ఆయన గుర్తు చేశారు.
అలా కాకుండా వారిని మానసికంగా హింసించేలా ప్రవర్తించినా, ఇల్లు ఖాళీ చేయాలని ఇబ్బందులకు గురి చేసినా, వారి పట్ల వివక్ష చూపించినా అలాంటి వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కష్టకాలంలో మనుషులు ఒకరికి ఒకరు అండగా నిలిస్తూ సమైక్యంగా కరోనాపై పోరాడాలని ఆయన జిల్లా ప్రజలను కోరారు.