తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఈటల రాజేందర్ తో ఫోన్లో మంతనాలు చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు కేంద్ర పార్టీ నీ నుంచి ప్రతినిధులను ఈటల రాజేందర్ వద్దకు పంపించి మంతనాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అసలు రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాల నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ రాష్ట్రంలో బలపడేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని యోచిస్తుంది.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన పార్టీలో సీనియర్‌గా పేరుపొందిన బీసీ వర్గానికి చెందిన ఈటల రాజేందర్‌ను అవమానకర రీతిలో మంత్రి పదవిని లాక్కోవడంతో బలహీన వర్గాల నాయకులను అణిచి వేస్తున్నారన్న విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. భూకబ్జా కేసులో ఇరికించి జైలుపాలు చేయాలనే యోచనలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ కుటిల పన్నాగం తిప్పికొట్టేందుకు బిజెపిలో చేరడమే శ్రేయస్కరంగా ఈటల రాజేందర్ కూడా భావిస్తున్నట్లు సమాచారం.
అయితే ఇందుకు సంబంధించిన చర్చోపచర్చలు ఈ మధ్యాహ్నం నుంచి కంటిన్యూగా కొనసాగుతున్నట్లు తెలిసింది. కేంద్రం నుంచి వచ్చిన బీజేపీ ప్రతినిధులు ఈటెల రాజేందర్‌తో మంతనాలు జరుపుతున్న సమయంలో నేరుగా కేంద్ర హోం శాఖ మంత్రితో స్వయంగా ఈటల రాజేందర్ మాట్లాడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఏది ఏమైనప్పటికీ ఈటెల రాజేందర్ బిజెపిలో చేరడం అనే విషయం టిఆర్ఎస్కి షాక్ లాంటిదే.