నెల్లూరు జిల్లా కోవూరు కొత్తూరు గ్రామానికి చెందిన రవీంద్ర, కలువాయి మండలం పెరమనకొండ గ్రామానికి చెందిన సమతకు 14 యేళ్ళ క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. పెళ్ళయిన కొన్నిరోజులకే వీరు కాపురం మార్చారు. దీంతో రవీంద్ర అల్లూరు మండలంలో పని చేసుకుంటూ బతుకీడుస్తున్నాడు.
పిల్లలిద్దరూ వేరే గదిలో పడుకొని ఉంటే భర్త, భార్య మాత్రం మరో గదిలో ఉండేవారు. దీంతో ప్రతిరోజు భర్త తాగే పాలలో నిద్రమాత్రలు కలిపి తాగించేది. ఇది కాస్త తెలియని భర్త రోజూ గాఢనిద్రలోకి వెళ్లిపోయేవాడు. ఇలా భర్త బెడ్ పైన నిద్రపోతూ ఉండగా ప్రియుడితో సమత శృంగారంలో మునిగితేలేది.
నిద్రమత్తులో ఉన్న భర్తను ప్రియుడితో కలిసి దిండును ముఖంపై అదిపిపెట్టి ఊపిరాడకుండా చేసి అతి కిరాతకంగా చంపేశారు. ఆ తరువాత గుండె నొప్పి అని నమ్మించే ప్రయత్నం చేసింది సమత. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. నిందితురాలిని అదుపులోకి తీసుకోగా ప్రియుడు పరారీలో ఉన్నాడు. రాము కోసం పోలీసులు గాలిస్తున్నారు.