తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మేడ్చల్, పోచారంకు చెందిన అనూష అనే మహిళ తన కుమార్తెతో కలిసి ఉంటోంది. ఈమెకు కరుణాకర్ అనే యువకుడితో మూడు నెలల కిందట ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో, కరుణాకర్ గురువారం మధ్యాహ్నం అనూష ఇంటికి వెళ్లాడు. అప్పటికే అక్కడ రాజశేఖర్ ఉండడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కరుణాకర్ రాకతో రాజశేఖర్‌ను అనూష బాత్రూంలో దాచింది. ఈ విషయం పసిగట్టిన కరుణాకర్ బాత్రూం నుంచి బయటికి రాకపోతే చిన్నారి ఆద్యను చంపేస్తానంటూ ఉన్మాదంతో రంకెలేశాడు. కానీ రాజశేఖర్ బయటికి రాకపోవడంతో అన్నంతపనీ చేశాడు.
అభంశుభం తెలియని ఆరేళ్ల ఆ చిన్నారి పాపను అత్యంత పాశవికంగా సర్జికల్ బ్లేడ్‌తో గొంతుకోసి చంపేశాడు. దాంతో హడలిపోయిన రాజశేఖర్ బాత్రూం నుంచి వెలుపలికి రాగా, అతడిపైనా కరుణాకర్ దాడి చేశాడు. అయితే ఆ మృగం బారి నుంచి తప్పించుకున్న రాజశేఖర్ పరుగులు తీశాడు. అనంతరం కరుణాకర్ అదే బ్లేడ్‌తో తన గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు.