తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ప్రధాన భూమికను పోషించిన కాంగ్రెస్ పార్టీ ఈ దఫా ఆ రాష్ట్రంలో అధికారం చేపట్టాలన్న ఏకైక లక్ష్యంతో పని చేస్తుంది. ఇందుకోసం కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అమలు చేసిన ఫార్ములానే ఇక్కడ కూడా అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులోభాగంగా ఆరు ప్రధాన హామీలతో రాష్ట్రంలో సునామీ సృష్టించారు.
ఆదివారం హైదరాబాద్ నగరంలోని తుక్కుగూడలో జరిగిన విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు పాల్గొని ఆరు ప్రధాన హామీలను ప్రకటించారు. పూర్తి మేనిఫెస్టోను త్వరలో విడుదల చేయనున్నారు.
ఈ సభలో కాంగ్రెస్ ఇచ్చిన ప్రధాన హామీలను పరిశీలిస్తే,
మహాలక్ష్మి పథకం : ఈ పథకం కింద మహిళలకు ప్రతి నెల రూ.2,500 ఆర్థిక సాయం చేస్తారు. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందజేస్తారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం.