కేబీఆర్ పార్క్ వద్ద గంజాయి స్మగ్లర్లు అరెస్టు

శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (14:42 IST)
హైదరాబాద్ నగరంలో నిత్యం అత్యంత రద్దీగా ఉండే కేబీఆర్ పార్కు వద్ద ముగ్గురు గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్న విషయం తెల్సిందే. ఇందులోభాగంగా, నగర వ్యాప్తంగా ఉక్కుపాదం మోపుతున్నారు. 
 
ఈ పరిస్థితుల్లో కేబీఆర్ పార్క్ వద్ద భారీ మొత్తంలో గంజాయి చేతులు మారుతున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. దీంతో మఫ్టీలో అక్కడ నిఘా వేసిన పోలీసులు అనుమానాస్పదంగా తిరుగుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా, అసలు విషయం వెల్లడైంది. వీరిలో ఒకరు మైనర్ బాలుడు ఉన్నాడు. దీంతో ఆ బాలుడుని సమీపంలోని పునరావాస కేంద్రానికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు