గోగుల్ చాట్ యజమానికి కరోనా - దుకాణం మూసివేత!

మంగళవారం, 16 జూన్ 2020 (18:38 IST)
హైదరాబాద్ మహానగరంలోని ప్రఖ్యాత గోగుల్ చాట్ తినుంబాడాల దుకాణం యజమానికి కరోనా వైరస్ సోకింది. దీంతో ఈ షాపును మూసివేశారు. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో, గోకుల్ చాట్‌ను ఇటీవలే తెరిచారు. 
 
అయితే, షాపు యజమాని కొన్ని రోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతూ వచ్చారు. దీంతో ఆయనకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. 
 
ఫలితంగా ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చాట్ దుకాణంలో పనిచేసే 20 మంది సిబ్బందిని క్వారంటైన్ చేశారు. గత రెండ్రోజులుగా గోకుల్ చాట్‌కు వచ్చిన వారి వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు