హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో గన్‌ఫైర్ జరిగింది. ఓ వ్యక్తి తన లైసెన్స్డ్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది.
ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుడిని కడపకు చెందిన న్యాయవాది శివారెడ్డిగా గుర్తించారు.
లైసెన్స్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు గమనించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.