తెలంగాణ సర్కారు ఈ నెల 25 నుంచి అంటే గురువారం నుంచి ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. రాబోయే తరాలు పచ్చదనంతో సుభిక్షంగా, ఆరోగ్యంగా ఉండాలన్న ఆకాంక్షతో ఈ కార్యక్రమానికి తెలంగాణ సర్కారు శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు జరిగిన ఐదు హరితహారాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో ఏటా కోట్లాది మొక్కలను సైతం నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను సైతం ప్రభుత్వం తీసుకుంది.
రాష్ట్రంలోని అన్ని జాతీయ, రాష్ట్రీయ రహదారుల వెంట మొక్కలు నాటే పని నిరంతరాయంగా కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్నీ రహదారుల వెంట ప్రతీ 30 కిలోమీటర్లకు ఒకటి చొప్పున నర్సరీలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.