వివరాల్లోకి వెళితే.. యాచారం పరిధిలోని నక్కర్తమేడిపల్ల గ్రామంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల ఫిరోజ్ స్థానికంగా ఎస్ఆర్ హేచరీస్‌లో పని చేస్తున్నాడు. రోజూ ఉదయం వేళ అతడికి వ్యాయామం చేసే అలవాటు వుంది. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం డంబెల్స్ తో వ్యాయామం చేస్తున్నాడు.