శోభనం గదికి వెళ్ళి కింద పడిన వరుడు, ఆసుపత్రికి తీసుకెళితే కరోనా పాజిటివ్, అంతే!!

గురువారం, 20 ఆగస్టు 2020 (19:09 IST)
కరోనావైరస్‌తో ఎంతోమంది చనిపోతున్నారు. మరికొంతమంది అనారోగ్యం పాలవుతూ చివరకు ఎన్నో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అయితే ఒక నవ వరుడు కరోనాతో మృతి చెందడం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అది కూడా పెళ్ళయిన 10 రోజులకే.
 
చిత్తూరు జిల్లా వి.కోటమండలం వెర్ని గ్రామం. ఈ నెల 12వ తేదీ కుటుంబ సభ్యులు పరిమిత సంఖ్యలో హాజరై వివాహం జరిపించారు. రాత్రికి శోభనానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు. వరుడి గదిలోకి వధువును పంపించారు. సరిగ్గా 10 నిమిషాలకే వధువు పెద్దగా కేకలు వేసింది.
 
ఏం జరిగిందో అర్థంకాక బంధువులందరూ పరిగెత్తుకు వెళ్ళారు. అప్పటికే వరుడు మంచం మీద నుంచి కిందపడిపోయాడు. స్పృహలో లేడు. వెంటనే వేలూరు సిఎంసికి తీసుకెళ్ళారు. అయితే ఆసుపత్రిలో మొదటగా ట్రూనాట్ పరీక్ష చేసి పాజిటివ్‌గా నిర్థారించారు.
 
దాంతో పాటు పక్షవాతం కూడా జత కావడంతో సీరియస్ కండిషన్‌లోకి వెళ్ళిపోయాడు. చివరకు చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున మృతి చెందాడు. కాళ్ళ పారాణి ఆరక ముందే భర్త చనిపోవడంతో ఆ నవ వధువు తీవ్రంగా కన్నీంటి పర్యంతమవుతోంది. వరుడు బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు