తెలంగాణ రాష్ట్రంలో డేంజర్ జోన్‌లోకి వెళ్లింది. ఈ వేసవి సీజన్‌లో దేశంలోనే అత్యధికంగా వడగాల్పులు వీచే ప్రాంతాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం చేరింది. మే, జూన్ నెలల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
నిజానికి ఏప్రిల్ నెలలోనే ఎండల తీవ్రత తీవ్రంగా ఉంది. ఈ కారణంగా ప్రజలు నానా ఇక్కట్లు పడుతున్నారు. ఇక, తీవ్రత పెరిగి, వడగాల్పులు వస్తే, పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. రాబోయే రోజుల్లో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణపైకి వేడి గాలులు రానున్నాయని, దీని ప్రభావంతో 47 నుంచి 49 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆదిలాబాద్, భద్రాచలం వంటి ప్రాంతాల్లో మరింత వేడి వుంటుందని తెలిపారు. ఇప్పటికే సాధారణంతో పోలిస్తే 2 నుంచి 4 డిగ్రీల వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అన్నారు. కాగా, ఈ ఎండల కారణంగా సుమారు 2.50 లక్షల ఎకరాల్లో వరి ఎండిపోయిందని, వేలాది ఎకరాల్లో వరి కోతలు నిలిచిపోయాయని, ఎండల దెబ్బకు కూలీలు కూడా వరికోతలకు వెళ్లడం లేదు.