రైల్వే స్టేషన్లకు రావొద్దు ... హెల్ప్‌లైన్ నంబర్లలో సంప్రదించండి

గురువారం, 7 మే 2020 (11:42 IST)
వివిధ ప్రాంతాల్లో చిక్కుకుని పోయిన వలస కూలీలు, కార్మికులను సొంత రాష్ట్రాలకు తరలించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వీరి తరలింపునకు చర్యలు చేపట్టింది. అదేసమయంలో వలస కూలీల తరలింపునకు భారతీయ రైల్వే శాఖ కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. దీంతో హైదరాబాద్ నగరంలో చిక్కుకునివున్న వేలాది మంది వలస కూలీలు ఒక్కసారిగా నాంపల్లి, లింగంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లకు తరలివస్తున్నారు. ఇలాంటి వారికి అధికారులో ఓ విజ్ఞప్తి చేశారు. 
 
ప్రత్యేక రైళ్ల కోసం ఎవరూ రైల్వే స్టేషన్లకు రావొద్దని రైల్వే అధికారులు కోరారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ నంబర్లను సంప్రదించాలని కోరుతున్నారు. శ్రామిక్‌ రైళ్లలో తమను స్వస్థలాలకు పంపించాలని దక్షిణ మధ్య రైల్వే హెల్ప్‌లైన్‌కు వలస కూలీలతో పాటు విద్యార్థులు, యాత్రికులు నుంచి పెద్ద సంఖ్యలో విజ్ఞప్తులు వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో రైల్వే అధికారులు స్పందించి.. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకే తాము రైళ్లను నడుపుతున్నామని, ప్రత్యేక రైళ్ల కోసం ఎవరూ స్టేషన్లకు రావొద్దని సూచిస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సహాయ నంబర్లు 040-23450624, 23450735, 100, వాట్సప్‌ నంబర్లు 90102 03526, 79979 50008 మాత్రమే సంప్రదించాలని కోరుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు