తెలంగాణలో తనిఖీలు.. రిసిప్టు లేకుండా రూ.20 కోట్లు స్వాధీనం

శుక్రవారం, 13 అక్టోబరు 2023 (21:48 IST)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి మొదలైంది. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం నగర వ్యాప్తంగా కట్టదిట్టమైన ఏర్పాటు, ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి రావడంతో తనిఖీలు మొదలైనాయి.
 
ఈ తనిఖీల్లో కేవలం రెండు రోజుల్లో సుమారు 20 కోట్లు రూపాయలు ఎలాంటి రిసిప్టు లేకుండా ఉన్న డబ్బును స్వాధీనం చేసుకున్నారు. రూ.37 కోట్లకు పైగా విలువైన నగదు, బంగారం, మద్యం, మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
వీటితో పట్టుబడిన వారిపై సిఆర్‌పిసిలోని వివిధ సెక్షన్ల కింద 1196 మందిని అధికారులు అరెస్టు చేశారు. తాజాగా కర్ణాటకలోని బెంగళూరులో జరుగుతున్న ఐటీ రైడ్స్ రూ.40 కోట్ల నగదు లభించడం కలకలం రేపుతోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు