అనుమానంతో ఆ భర్త ఎంత పనిచేశాడు.. తలపై గొడ్డలితో కొట్టి..?

శుక్రవారం, 23 జులై 2021 (12:23 IST)
అనుమానంతో ఆ భర్త భార్యను హతమార్చాడు. నిజామాబాద్ జిల్లాలో ఈ ఘోరం జరిగింది. రుద్రుర్ మండలంలో గంగాధర్ కుటుంబం నివాసముంటోంది. గంగాధర్‌కు భార్య మల్లీశ్వరి, కూతురు రుత్విక ఉన్నారు. 
 
పచ్చగా సాగుతున్న ఈ కుటుంబంలోకి అనుమానమనే భూతం చొరబడింది. దీంతో భర్త గంగాధర్.. భార్య మల్లీశ్వరిని అనుమానించడం మొదలు పెట్టారు. తాను లేని సమయంలో ఇంట్లో భార్య ఏదో చేస్తోందని ఆందోళన చెందాడు. దీంతో ఆమెను అనుమానిస్తూ కొన్ని రోజులుగా గొడవకు దిగుతున్నారు. 
 
గత వారంగా భర్త గంగాధర్ అనుమానం మరింత పెరిగింది. భార్యను చిత్ర హింసలకు గురి చేశాడు. దీంతో మల్లీశ్వరి, గంగాధర్ మధ్య గొడవ తీవ్ర స్థాయికి చేరింది. అంతే భర్త గంగాధర్ ఆగ్రహానికి గురై భర్య మల్లీశ్వరి తలపై గొడ్డలితో కొట్టి అత్యంత కిరాతకంగా నరికి చంపాడు. అంతటితో ఆగకుండా కూతురును కూడా దారుణం నడికి చంపేశాడు. అక్కడి నుంచి పారిపోయాడు.
 
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీంచారు. స్థానికుల నుంచి సమాచారం సేకరించారు. భర్త అనుమానమే ఈ దారుణానికి కారణమని నిర్దారించారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు ఆస్పత్రికి తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు