తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మైసూరు సమీపంలోని టి.నరసిపుర తాలూకాలోని హుణసగళ్ళిలో వెంకటరాజు, ఉమ అనే దంపతులు ఉన్నారు. అయితే, ఉమకు అదే ప్రాంతానికి చెందిన అవినాశ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇది భర్తకు తెలిసి భార్యను హెచ్చరించాడు. పైగా, అవినాశ్‌తో శారీరకసుఖం తీర్చుకునేందుకు భర్త అడ్డుగా మారాడు.
దీంతో ఆయన్ను మట్టుబెట్టాలని ఉమ నిర్ణయించుకుని, తన ప్రియుడు అవినాశ్‌తో చేతులు కలిపింది. ఈ క్రమంలో కాఫీలో విషం కలిపి భర్తకు ఇచ్చింది. ఈ కాఫీని సేవించిన వెంకటరాజు స్పృహ కోల్పోయాడు. ఆ తర్వాత తలదిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేశారు.
ఆ తర్వాత సాధారణ మరణంగా చిత్రీకరించింది. అయితే, వెంకటరాజు కుటుంబ సభ్యులు సందేహించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉమ - అవినాశ్‌లో అక్రమం సంబంధం బహిర్గతం కావడంతో వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో అసలు విషయం వెల్లడైంది. దీంతో ఉమ, అవినాశ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు దర్యాప్తు జరుపుతున్నారు.