హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం రాత్రి నుంచి హైదరాబాద్‌లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇంకా అత్యంత వేగంగా జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
అలాగే భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి బుధవారం మధ్యాహ్నం నదిలో నీటి మట్టం 43 అడుగులు దాటడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
రాత్రి 10 గంటల సమయానికి 48 అడుగులకు ప్రవాహం పెరిగింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి వరద అంతకంతకూ పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.