ఈ వివరాలను పరిశీలిస్తే... పెద్ద అంబర్‌పేట శాంతినగర్‌కు చెందిన యువతి ఎల్‌బీనగర్ చింతల్‌కుంటలోని ఓ వస్త్ర దుకాణంలో సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోంది. ఆదివారం రాత్రి 9.30 గంటలకు బాధితురాలు విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరింది. పెద్ద అంబర్‌పేట్ వద్ద బస్సు దిగి, శాంతినగర్‌కు నడుచుకుంటూ వెళ్తోంది.
ఆ సమయంలో ముగ్గురు యువకులు ఏపీ 29 టీవీ 6595 కారులో వచ్చి బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. అరవకుండాచేతి టవల్‌ను నోట్లో కుక్కారు. బలిజగూడ వైపు వెళ్తూ కారులోనే ఆమెపై ఒక యువకుడు అత్యాచారం చేశాడు. బాధితురాలిని కారులోకి లాగుతుండగా శాంతినగర్‌కు చెందిన ఒక వ్యక్తి ఆమెను తమ ప్రాంతానికి చెందిన యువతిగా గుర్తించాడు. స్థానికులను అప్రమత్తం చేశాడు. దీంతో దుండగులు కారు అక్కడే వదిలి పరారయ్యారు.