రూ.450 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన కేటీఆర్

శనివారం, 19 ఆగస్టు 2023 (16:27 IST)
హైదరాబాద్ ఇందిరాపార్కు (ఇందిరా పార్క్) నుంచి వీఎస్టీ వరకు రూ.450 కోట్లతో నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. స్టీల్‌ బ్రిడ్జి ప్రారంభంతో నాలుగు జంక్షన్లలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. 
 
ఉస్మానియా విశ్వవిద్యాలయం, హిందీ మహా విద్యాలయం వరకు వెళ్లేందుకు ప్రయాణ సమయం కూడా తగ్గిపోతుంది. ఇప్పటికే ఈ బ్రిడ్జికి మాజీ హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి పేరు పెట్టారు. ఇంకా ఆ స్టీల్ బ్రిడ్జి ప్రారంభంతో ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద ట్రాఫిక్‌ రద్దీ తగ్గిపోనుంది. 
 
సిగ్నల్‌ రహిత ప్రయాణమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన 48 ప్రాజెక్టులలో ఇదొకటి. సిటీ చరిత్రలోనే తొలిసారిగా భూ సేకరణ జరపకుండా, పూర్తిగా ఉక్కుతోనే నిర్మించిన బ్రిడ్జి ఇదే కావడం విశేషం. 
 
దక్షిణాదిలో అత్యంత పొడవైన స్టీల్ బ్రిడ్జిగా ఈ వంతెన రికార్డులకెక్కింది. 2.62 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ బ్రిడ్జి కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు రూ.450 కోట్లు వెచ్చించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు