హైదరాబాద్‌లో ఫ్లై-ఓవర్‌పై నుంచి పడి ఓ మహిళ మృతి చెందింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఆమె స్నేహితుడు కూడా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే కోల్‌కతాకు చెందిన స్వీటీ పాండే (22), ఆమె స్నేహితుడు రియాన్ లూక్ గురువారం సాయంత్రం జేఎన్‌టీయూ నుంచి ఐకియా వైపు వెళ్తున్నారు.
అయితే హైటెక్ సిటీ ఫ్లైఓవర్‌పై ప్రయాణిస్తుండగా, అతివేగం కారణంగా ద్విచక్ర వాహనంపై రైడర్ అదుపు తప్పి రిటైనింగ్ వాల్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో స్వీటీ ఫ్లై ఓవర్‌పై నుంచి యువతి కింద రోడ్డుపై పడి తలకు గాయాలయ్యాయి.