తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాక్‌టౌన్ కాలనీ తిరుమల అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉండే రామ తులసి (50), మూసారాంభాగ్‌కు చెందిన ఉమారాణి (39)తో కలిసి వివిధ ప్రాంతాల నుంచి మహిళలు, యువతలను అపార్ట్‌మెంట్‌కు తీసుకువచ్చి గుట్టుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. మంగళవారం రాత్రి అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి చంద్రపురి కాలనీకి చెందిన మహిళ (43), మన్సురాబాద్‌లో నివాసం ఉండే ప్రశాంత్‌కుమార్ (26)ను అరెస్టు చేశారు. అలాగే అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న మరో మహిళను సైతం అరెస్టు చేశారు.
వీరివద్ద నుంచి ఐదు ఫోన్లు, రూ.3 వేల నగదు, కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. సదరు మహిళలతో పాటు యువకుడిని అరెస్ట్ చేసి, బుధవారం రిమాండ్‌కు తరలించారు.