హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. ఓ ద్విచక్రవాహనాన్ని టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దుర్మరణం పాలయ్యారు. మృతుడుని జగన్మోహన్ రెడ్డిగా గుర్తించారు. బైకును ఢీకొట్టిన తర్వాత టిప్పర్ లారీ ఆగకుండా వేగంగా దూసుకెళ్లిపోయింది. దీంతో మృతదేహాన్ని టిప్పర్ లారీ 20 మీటర్ల వరకు ఈడ్చెకెళ్లింది.