వివరాల్లోకి వెళితే.. మహబూబ్ నగర్ జిల్లా, నవాబ్ పేట్ మండలం ఇప్పతూరు గ్రామానికి చెందిన నర్సమ్మ (70)కు పార్వతమ్మ అనే కుమార్తె ఉండేది. ఈమె మద్యానికి అలవాటుపడి.. తాగేందుకు డబ్బులివ్వలేదని కన్నతల్లినే హతమార్చింది. వారంరోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. హతమార్చిన ఐదో రోజున తల్లి శవాన్ని తరలిస్తుండగా... స్థానికులు గమనించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
ఇకపోతే.. కాగా, నాలుగేళ్ల క్రితం ఇదే ఇంట్లో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. మద్యానికి బానిసైన నర్సమ్మ పెద్ద కొడుకు సైతం తాగడానికి డబ్బులివ్వలేదన్న కారణంతో తండ్రిని హత్య చేశాడు. కాగా, మద్యానికి బానిసవడం వల్ల పార్వతమ్మ వైవాహిక జీవితం కూడా దెబ్బతిన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇప్పటికే రెండు పెళ్ళిళ్లు అయినా.. తాగుడుతో పుట్టింటికే పరిమితం అయ్యింది.