ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్రానికి చెందిన లక్ష్మణ్ జా (30) అనే వ్యక్తికి భార్య కుష్బుదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. గత రెండేండ్ల క్రితం నగరానికి వలస వచ్చి సోమాజిగూడ డివిజన్, రాజ్‌నగర్ మక్తాలో ఉంటున్నారు.
వివాహేతర సంబంధానికి లక్ష్మణ్ అడ్డుగా ఉన్నాడని.. అతడిని అడ్డు తొలగించుకోవానుకున్నది. ఈ క్రమంలో ఈ నెల 14న రాత్రి లక్ష్మణ్ జా పడుకోగా.. కుష్బు ప్రియుడితో కలిసి భర్త గొంతు నులిమి, చున్నీతో ఉరివేసి హతమర్చాడు. అనంతరం ఖైరతాబాద్‌లో నివాసం ఉండే మృతుడి సోదరుడు బీహారీ జాకు ఫోన్ చేసి లక్ష్మణ్ నిద్రలోనే చనిపోయాడని చెప్పింది.