ఇటీవల మద్యం మత్తులో చాలా ప్రమాదాలు, మరణాలు సంభవిస్తున్నాయి. కొందరు డ్రైవర్ తాగి ఉన్నాడని తెలిసి కూడా ప్రయాణం చేస్తుంటారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే ప్రమాదాలను, మరణాలను అరికట్టేందుకు సైబరాబాద్ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
డ్రైవరు తాగి వాహనం నడుపుతున్నాడని తెలిసీ అందులో ప్రయాణించడం నేరమని స్పష్టం చేశారు. మోటార్ వాహన చట్టం సెక్షన్ 188 ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎవరికైనా ఇవే నిబంధనలు వర్తిస్తాయని సామాజిక మాధ్యమాలైన ట్విటర్, ఫేస్‌బుక్‌లలో వెల్లడించారు.