బీజేపీ ప్రభుత్వం జర్నలిస్టులకు ఎప్పుడు అండగా ఉంటుందని, వారి కొరకు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా కరోనాతో తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకోసం ప్రత్యేక సంక్షేమ పథకం ఏర్పాటు చేశామని వారి కాళ్ళ మీద వారు నిలబడే వరకూ ఉచిత విద్యను అందిస్తూ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలిపారు.
పెరిగిన పెట్రోల్ ధరలపై స్పందిస్తూ బీజేపీ పాలిత రాష్ట్రాలైన గోవా, గుజరాత్ రాష్ట్రాలలో తక్కువ ధరకే పెట్రోల్ దొరుకుతుందని, మిగిలిన రాష్ట్రలు కూడా రాష్ట్ర ప్రభుత్వ టాక్స్ సర్వీస్ తగిస్తే ప్రజలపై భారం తగ్గుతుందని, జర్నలిస్టులకు చిన్న సాయంగా బీయం అందజేస్తామని వారికి ఎప్పుడు స్థానిక నాయకత్వం కూడా అండగా ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం అధ్యక్షులు కాజ కిరణ్,కిసాన్ మోర్చ అధ్యక్షులి శ్రీ రేగళ్ళ రఘునాద్ రెడ్డి, కొండపల్లి మున్సిపాలిటి అధ్యక్ష కార్యదర్సులు, అద్దేపల్లి ఆంజనేయులు, బొర్రాప్రవీణ్, నక్కా రమేష్, ఇబ్రహింపట్నం పార్టి అధ్యక్షులు కాజాకిరణ్, క్రిష్ణమోహన్, యుగంధర్, యస్.సి సెల్ పల్లె నరేష్ దర్సనపు స్వతంత్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.