పెన్షన్ల విషయంలో బీజేపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ఎండగట్టారు. బీజేపీ నాయకులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. పెన్షన్లకు కేంద్రం అధిక మొత్తంలో డబ్బులు చెల్లిస్తుందని చెబుతున్నారు. ఒకవేళ దాన్ని ఎవడైనా మొగోడు రుజువు చేస్తే ఒక్కటే నిమిషంలో సీఎం పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతాను అని సీఎం కేసీఆర్ తీవ్రమైన సవాల్ చేశారు.
దుబ్బాకలో ఉప ఎన్నికలో బీజేపీ వాళ్లు గెలిచేది లేదు.. పీకేది లేదు. అక్కడ టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది. దేశాన్ని పాలిస్తున్న బీజేపీ నాయకులు ఘోరాతి ఘోరమైన అబద్దాలు మాట్లాడుతున్నారు. మన రాష్ర్టంలో 38 లక్షల 64 వేల 751 మందికి అన్ని రకాల పెన్షన్లు ఇస్తున్నాం. ఈ పెన్షన్లలో కేంద్రం కేవలం 7 లక్షల మందికి మాత్రమే ఇస్తోంది.